హాస్టల్‌ విద్యార్థిని పరారీ | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థిని పరారీ

Published Mon, Feb 10 2025 1:26 AM | Last Updated on Mon, Feb 10 2025 1:26 AM

-

సారంగపూర్‌: మండలంలోని స్వర్ణ ఆశ్రమ పా ఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న భైంసాకు చెందిన విద్యార్థిని హాస్టల్‌ నుంచి ప రారైంది. ప్రిన్సిపాల్‌ సంగీతారాణి తెలిపిన వి వరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 10.30 గంటలకు హాస్టల్‌కు చికెన్‌ రాగా, వాచ్‌మెన్‌ గేటు తెరిచాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న విద్యార్థిని రెప్పపాటులో బయటకు పరుగెత్తింది. వాచ్‌మెన్‌ వృద్ధుడు కావడంతో ఆమెను ప ట్టుకోలేకపోయాడు. స్థానికుల సాయంతో గా లించినా విద్యార్థిని ఆచూకీ దొరకలేదు. దీంతో ప్రిన్సిపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీటీడబ్ల్యూవో అంబాజీని వివరణ కోరగా.. విద్యార్థిని పారిపోయిన వెంటనే తా ను పాఠశాలకు వెళ్లానని తెలిపారు. వాచ్‌మెన్‌, విద్యార్థినులతో మాట్లాడిన అనంతరం ప్రిన్సి పాల్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై విద్యార్థిని తల్లికి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వసంత్‌ తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement