![మార్షల్ ఆర్ట్స్‌లో బంగారు పతకం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09nrl177-340155_mr-1739130942-0.jpg.webp?itok=tARQpSKR)
మార్షల్ ఆర్ట్స్‌లో బంగారు పతకం
సోన్: మండలంలోని కడ్తాల్ వేదిక్ పాఠశాల విద్యార్థులు నాలుగో అంతర్జాతీయ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్ కట్ట విభాగంలో బంగారు పతకం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మామిల్ల లింగయ్య ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, సినీ హీరో భానుచందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నాలుగో అంతర్జాతీయ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, మామిల్ల సంజన, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తోటి విద్యార్థులు విజేతలను అభినందించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment