![‘బేడీలు వేయడం దురహంకారమే’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09nrl276-340134_mr-1739130940-0.jpg.webp?itok=RaR0qQza)
‘బేడీలు వేయడం దురహంకారమే’
నిర్మల్‌చైన్‌గేట్: భారతీయులకు బేడీలు వేసి పంపిస్తున్న ట్రంప్‌వి దురహంకార చర్యలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కే రాజన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయులకు ట్రంప్ బేడీలు వేసినా స్పందించని ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు సిగ్గు చేటని విమర్శించారు. ప్రపంచ దేశాలు ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తుంటే ప్రధాని మోదీ మాత్రం మౌనం వహిస్తూ అతడికే మద్దతు ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. ట్రంప్ విధానాలను నిరసిస్తూ ప్రజలు వ్యతిరేకంగా పోరాడాలని పిలు పునిచ్చారు. సమావేశంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, జిల్లా నాయకులు ఎం.బక్కన్న, ఎస్.గంగన్న, ఎండీ గపూర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment