ఆర్మూర్‌టౌన్ : ఆర్మూర్ పట్టణంలోని చిన్న బ జార్‌లోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రి య సమాజ్ ఆధ్వర్యంలో 70ఏళ్లకు పైగా వి నాయక విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేస్తున్నారు. ప్రతి ఏడాది సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం రాత్రి వినాయకుడికి ప్రత్యేక పూజలను నిర్వహించి అందులో భాగంగా చక్రిభజన చేయ డం ఆనవాయితీగా వస్తుంది. నవరాత్రి ఉత్సవాల్లో 11 రోజుల పాటు చక్రిభజన కార్యక్ర మం చేయడం జిల్లాలోనే ఓ ప్రత్యేకత. అలాగే శోభాయాత్ర నిర్వహించిన రోజు పట్టణంలో ని ప్రధాన కూడలిల వద్ద చిన్నాపెద్దా తేడా లే కుండా ప్రతి ఒక్కరు ఈ చక్రిభజనలో పాల్గొంటారు. నిమజ్జనం రోజు క్షత్రీయ సమాజ్ కులస్తులు చేసే చక్రి భజన కార్యక్రమానికి చూడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపడతారు.
ఆర్మూర్‌లోని క్షత్రీయ సమాజ్ ఆధ్వర్యంలో
ప్రతిష్ఠించిన వినాయకుడు
Comments
Please login to add a commentAdd a comment