![మహేశ్ (ఫైల్)
- Sakshi](/styles/webp/s3/article_images/2023/11/3/02bdn51-250073_mr.jpg.webp?itok=hdk0GF7H)
మహేశ్ (ఫైల్)
వర్ని: మండలంలోని సిద్ధాపూర్‌కు చెందిన బాదావత్ మహేశ్(22) ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై గ్రామానికి చెందిన మహేశ్, రాజేశ్‌లు నేరేడుకొండలో ట్రాక్టర్ డ్రైవర్, క్లీనర్‌గా పనిచేస్తున్నారు. రాత్రి నేరేడుకొండ సమీపంలో బైక్ ఎదురుగా వస్తున్న బస్సు వీరిని ఢీకొన్నది. ఈ ఘటనలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందడగా రాజేశ్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ స్పెషల్ టీం 2లో పనిచేస్తున్న కార్మికుడు రంజిత్ అలియాస్ గంగాధర్ డిచ్‌పల్లి మండలంలోని గొల్లపల్లిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివరాజ్ తెలిపారు. ముబారక్‌నగర్‌కు చెందిన గంగాధర్ మూడేళ్లుగా మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
డెంగీతో ఆఫీస్ సబార్డినేట్..
నిజామాబాద్ రూరల్: డెంగీతో రూరల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సబార్డినేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న జగన్ (29) మృతి చెందినట్లు ఎంపీడీవో మల్లేశ్ గురువారం తెలిపారు. గత రెండేళ్లుగా కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్న జగన్ మూడు రోజుల క్రితం డెంగీతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆరోగ్యం పూర్తిగా క్షణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్యాలయ సిబ్బంది, అధికారులు జగన్ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
![గంగాధర్(ఫైల్) 1](https://www.sakshi.com/gallery_images/2023/11/3/02nzt113-250040_mr.jpg)
గంగాధర్(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment