![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/16kmr281-250034_mr_1.jpg.webp?itok=ffOOCH_8)
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని గురు రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు.వివరాలిలా ఉన్నాయి.కాలనీలో నివాసం ఉండే గాజుల రాజ్‌కుమార్ ఇంటికి తాళం వేసి సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లాడు. మంగళ వారం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దేవునిపల్లి ఎస్సై రాజు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఇంట్లోని బీరువా లో దాచిన 2 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గాంధారిలో పట్టపగలే..
గాంధారి: మండల కేంద్రంలోని దుర్గానగర్ కాలనీలో మంగళవారం పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు ధ్వంసం చేసి చేసి చోరీకి పాల్పడ్డారు. ఆర్‌ఎంపీ డాక్టర్ నగేశ్ దుర్గానగర్‌లో నూతన ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు. పిల్లల చదువుల నిమిత్తం వారు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నగేశ్ హైదరాబాద్‌కు వెళ్లాడు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఇంటి యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
వెంకటాపూర్‌లో చోరీ
వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన గంధం లక్ష్మి, గంధం లావణ్య ఇళ్లల్లో దుండుగులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ కోసం తాము కుటుంబ సభ్యులతో కలిసి పుట్టింటికి వెళ్లగా దొంగలు తమ ఇళ్లల్లో చోరీ చేసినట్లు తెలిపారు. రెండిళ్లల్లో రెండు బంగారు గొలుసులు, వెండి వస్తువులు అపహరించినట్లు చెప్పారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment