![ముగ్గుల పోటీల విజేతలతో నిర్వాహకులు - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/18/17nzt703-250041_mr_0.jpg.webp?itok=u6a5sl6-)
ముగ్గుల పోటీల విజేతలతో నిర్వాహకులు
సుభాష్‌నగర్: నగరంలోని ఆదర్శ్‌నగర్‌లోగల విశ్వహిందూ పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం వీహెచ్‌పీ, దుర్గావాహిని మాతా శక్తి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను ఆయా సంఘాల ప్రతినిధులు నిర్వహించారు. పలువురు మహిళలు సమాజానికి సందేశానిచ్చే విధంగా ఎంతో చక్కని రంగవల్లులు వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహిళా నాయకురాలు ధన్‌పాల్ అంజలి మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. మహిళలు వేసిన రంగవల్లులను పరిశీలించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గుండాల వర్ష (మొదటి బహుమతి), సాహితి (రెండో బహుమతి), అలాగే కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. అయోధ్య రామమందిరం నమూనా, సీతారాములు ఉన్న ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. సంఘ ప్రతినిధులు సుబేధార్, ఝాన్సీ కపిల్, గాజుల దయానంద్, ధాత్రిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
![అయోధ్య రామమందిరం ముగ్గు వేసిన
గుండాల వర్ష (ప్రథమ బహుమతి)1](https://www.sakshi.com/gallery_images/2024/01/18/17nzt704-250041_mr.jpg)
అయోధ్య రామమందిరం ముగ్గు వేసిన గుండాల వర్ష (ప్రథమ బహుమతి)
Comments
Please login to add a commentAdd a comment