కామారెడ్డి ఉండన్నా.. పోవన్నా? | Sakshi
Sakshi News home page

కామారెడ్డి ఉండన్నా.. పోవన్నా?

Published Wed, May 8 2024 5:55 AM

కామార

సాక్షి, కామారెడ్డి: ‘ఒక్క మాట చెప్పాలె! కామారెడ్డి జిల్లా ఉండన్నా.. పోవన్నా.. తీసేస్త అంటుండ్రు.. కాపాడుకుంటరా.. పోగొట్టుకుంటరా? మీ ఇష్టం’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మంగళవారం రాత్రి కామారెడ్డిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో అ న్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలను తీసేస్తా అంటుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. దీంతో ప్రజలు జిల్లా ఉండాల్సిందేనని నినాదాలు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా, కామారెడ్డి జిల్లాను కాపాడుకోవాలన్నా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, పార్టీ గాలి అనిల్‌కుమా ర్‌కు మెజారిటీ ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు. జిల్లా రద్దు చేస్తారట అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.

ఆలస్యంగా ప్రారంభం

షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 5 గంటలకు కామారెడ్డికి చేరుకోవాల్సిన కేసీఆర్‌ బస్సుయాత్ర.. రాత్రి 7.25 గంటలకు చేరుకుంది. నిజాంసాగర్‌ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌ తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్‌ షో రైల్వే బ్రిడ్జి, స్టేషన్‌ రోడ్డు, ఇందిరా చౌక్‌, సిరిసిల్లా రోడ్డు, జేపీఎన్‌ రోడ్డు మీదు గా జేపీఎన్‌ కూడలి వరకు సాగింది. మెదక్‌లో నిర్వహించే సభలో పాల్గొనాల్సి ఉండడంతో కేసీఆర్‌ ఇతర నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నేరుగా మైక్‌ అందుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అసమర్థులు, తెలివితక్కువ వారి చేతుల్లో రాజ్యం ఉందన్నారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందని, రూపాయి విలువ పడిపోయి అంతర్జాతీయంగా ప్రతిష్ట దెబ్బతిందని విమర్శించారు. రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి కామారెడ్డికి వచ్చిన కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.

జిల్లాను రద్దు చేస్తారట !

రాష్ట్రంలో అసమర్థుల చేతుల్లో రాష్ట్రం

మోదీ పాలనలో

దేశ ఆర్థికస్థితి ఛిన్నాభిన్నం

రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

కామారెడ్డి ఉండన్నా.. పోవన్నా?
1/2

కామారెడ్డి ఉండన్నా.. పోవన్నా?

కామారెడ్డి ఉండన్నా.. పోవన్నా?
2/2

కామారెడ్డి ఉండన్నా.. పోవన్నా?

Advertisement
Advertisement