మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజాభివృద్ధి
నిజామాబాద్‌నాగారం: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని అంధుల వనరుల కేంద్రంలో శనివారం మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైసెస్ ఆధ్వర్యంలో ‘మహిళ సాధికారత– మహిళ ప్రాముఖ్యత’పై మహిళ సెక్స్ వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆర్థిక పురోగతి బాగుంటుందన్నారు. మహిళ సెక్స్ వర్కర్ల సమస్యలు, వారు ఆర్థిక పురోగతి ఇతర విషయాలను మేయర్, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమ వంతు బాధ్యతగా మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, గాంధీ ఆస్పత్రి సిబ్బంది మల్లికార్జున్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment