బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలు
సుభాష్‌నగర్: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలుగా వ్యవహరించి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానా రాయణ గుప్తా అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అనవసర విషయాలపై చర్చపెట్టి విలువైన సభా సమయాన్ని వృథా చేసిందని, తద్వారా ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించే సమయం లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నో కలలతో, లక్ష్యాలతో అసెంబ్లీలో అడుగు పె ట్టానని, ప్రజల గొంతుకగా నియోజకవర్గ సమస్య లు వినిపించాలనుకుంటే సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో 45 నిమిషాలు చర్చ అవసరమా అని ప్రశ్నించారు. గురుకులాల్లో కల్తీ ఆహారంతో చనిపోతే, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. హైడ్రా బాధితుల బా ధలు, సీఎం సొంతూరులో మాజీ సర్పంచ్ చనిపోతే, హిందువుల గుళ్లపై దాడులు జరిగితే ఎందు కు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధికి కట్టుబడి ఉన్నా..
ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ముఖ్యంగా 600 డబుల్ బెడ్‌రూం ఇండ్ల మరమ్మతులకు రూ. 1.5 కోట్లు విడుదల చేయాలని ధన్‌పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అర్బన్ నియోజకవర్గంలో 52 వేల మంది ఇండ్లు లేని పేదలు ఉన్నారని, మొదటి విడతలో 7వేల ఇండ్లు ఇవ్వాలన్నారు. ఏడాది కాలంగా సీడీపీ నిధులు విడుదల చేయని ఏకై క ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతవరకు వెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సమావేశంలో నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, మల్లేశ్ యాదవ్, ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్, సాయిరా, పంచరెడ్డి శ్రీధర్, వేణు, హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమయాన్ని ప్రభుత్వం
వృథా చేసింది
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment