స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి

Published Wed, Jan 8 2025 1:21 AM | Last Updated on Wed, Jan 8 2025 1:21 AM

స్థాన

స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి

నఫ్రత్‌ చోడో.. నిజామాబాద్‌ జోడో..

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఆశించిన స్థాయిలో ఉందని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చా రు. ఇది పీసీసీ అధ్యక్షుడి జిల్లా అని, స్థానిక ఎన్నిక ల్లో ఒక్క సీటు ఓడిపోవద్దన్నారు. జిల్లాకు మంత్రి పదవి వస్తుందన్నారు. మంగళవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో జరిగిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లు ఎన్నో కష్టానష్టాలకు ఓర్చి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఆదుకునే సమ యం ఇదేనన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడా ది గడిచినా పదవులు రాలేదని నిరాశకు గురికావద్దని,స్థానిక సమరం మీదేనని, ఓపికగా ఉండా లన్నా రు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో సేవలందించిన అనంతరం తాను పార్టీ అధ్యక్షుడిని అయ్యానన్నారు. కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు పదవులు ఇస్తామన్నారు. స్థాని క ఎన్నికల్లో ఇన్‌చార్జులదే బాధ్యత అని, విభేదాలను వీడి అందరినీ కలుపుకుని ఐక్యంగా ముందుకు పోవాలన్నారు. తేడా వస్తే మీకే నష్టమని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ ఒక్కరిపై నడవదని, పీసీసీ, ఏఐసీసీ చెప్పినట్లు నడుచుకోవా ల్సి ఉంటుందన్నారు. ఈసారి ఎన్నికల్లో 63 సీట్లు వచ్చాయని, రానున్న ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకోవడంతో పాటు మరిన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి రాహుల్‌ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ చేసిన ఆర్థిక విధ్వంసం, దోపిడీ, రాష్ట్రాన్ని మోసం చేసిన తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చే స్తున్న కాంగ్రెస్‌ పార్టీ గురించి గ్రామస్థాయిలో ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. ఫార్ములా – ఈ కార్‌ రేస్‌లో అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్‌ అని, పదేళ్ల తర్వాత బీసీలపై కవిత ప్రేమ నటిస్తోందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. బీజేపీ మతం పేరుతో 8 సీట్లు గెలిచిందని, అయితే ఇప్పటి వరకు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కేంద్రం నుంచి పైసా నిధులు తేలేదని విమర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ గాంధీని ఎవరూ బెదిరించలేరని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి అదర్శంగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానపర్చేలా కేంద్ర హోమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 26 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జిల్లాకు త్వరలోనే అగ్రికల్చర్‌ కాలేజ్‌ వస్తుందని, తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రూ.2 లక్షల వరకు రుణ మాఫీ ఖాయమన్నారు.

డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ప్రొటోకాల్‌ ఇన్‌చార్జి వేణుగోపాల్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి సుదర్శన్‌రెడ్డి, డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, అడ్లూర్‌ లక్ష్మణ్‌ కుమార్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అనిల్‌కుమార్‌, అన్వేష్‌రెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్‌, జావేద్‌ అక్తర్‌, నుడా చైర్మన్‌ కేశవేణు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌రెడ్డి, నాయకులు వినయ్‌ రెడ్డి, సునీల్‌రెడ్డి, నర్సింగ్‌రావు, అంతరెడ్డి రాజరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అకుల లలిత, అరికెల నర్సారెడ్డి, రాజేశ్వర్‌, ఏఎంసీ చైర్మన్‌ ముప్పగంగారెడ్డి, శేఖర్‌గౌడ్‌, ఖైసర్‌, నరేందర్‌సింగ్‌, మునిపల్లి సాయరెడ్డి, వేణురాజ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తాం

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయం

జిల్లాకు మంత్రి పదవి వస్తుంది

జిల్లాకు వచ్చే అగ్రికల్చర్‌

కాలేజీ తెలంగాణ వర్సిటీలో

ఏర్పాటు చేస్తాం

టీపీసీసీ అధ్యక్షులు

మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

రాహుల్‌ గాంధీ నినాదం నఫ్రత్‌ చోడో.. దేశ్‌ జోడో అన్న విధంగానే నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నఫ్రత్‌ చోడో.. నిజామాబాద్‌ జోడో.. అని ఐకమత్యంగా ఉండి స్థానిక ఎన్నికల్లో వందశాతం విజయం సాధించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర హోమంత్రి అమిత్‌షా కు అంబేడ్కర్‌ అంటే గౌరవం లేదని, రాజ్యాంగంపై నమ్మకం లేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలే శత్రువులని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి1
1/3

స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి

స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి2
2/3

స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి

స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి3
3/3

స్థానికంలో గెలుపే లక్ష్యం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement