![ఖిల్లా రామాలయం అభివృద్ధికి కృషి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nzr111-250043_mr-1739216507-0.jpg.webp?itok=-HSdpHtB)
ఖిల్లా రామాలయం అభివృద్ధికి కృషి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): డిచ్‌పల్లి ఖిల్లా రా మాలయం అభివృద్ధికి కృషిచేస్తానని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్‌రెడ్డి అన్నారు. వైభవంగా కొనసాగుతున్న ఆలయ బ్రహ్మోత్సవాల్లో సోమ వారం ఆయన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలి సి పాల్గొన్నారు. అలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆయనకు ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని తెలియజేశారు. రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, వీడీసీ సభ్యులు వారికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, రామడుగు ప్రాజెక్టు, గుండారంలోని లక్ష్మాపూర్ లోని అనంత పద్మనాభస్వామి ఆలయాలను కలిపి టూరిజం హబ్‌గా మార్చి పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చే విధంగా చూస్తామన్నారు. డిచ్‌పల్లి రామాలయం చెరువుతోపాటు రామడుగు ప్రాజెక్టులో బోటింగ్ సౌకర్యం కల్పించాలని రమేశ్‌రెడ్డిని కోరారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారచంద్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, మునిపల్లి సాయరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment