![నాళం మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/25/24vie42a-310147_mr_0.jpg.webp?itok=7xX0DETD)
నాళం మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి
కోనేరుసెంటర్: జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీ పి. జాషువ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన చూపిన ప్రేమ, కరుణ, దయ, శాంతి సుగుణాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరారు. అలాగే తోటి వారి పట్ల జాలి కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పోలీసు కుటుంబాలతో పాటు జిల్లా ప్రజలంతా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉమ్మడి కృష్ణా కమిటీ ఎన్నిక
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్/ల్యాబ్ అటెండెంట్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా సయ్యద్ వజీరుద్దీన్ ఖాదీర్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సీహెచ్ రమణ, వైస్ ప్రెసిడెంట్‌లుగా టి.రాజారత్నబాబు, వి.చిన్నబాబు, కె.వెంకటనాథ్, టి.శివప్రసాద్ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నాళం ముళీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్. ప్రభాకర్, జాయింట్ సెక్రటరీలుగా జీఎస్ దీక్షితులు, వి.కృష్ణకిషోర్, ఎంఎన్ కోటేశ్వరరావు, జీవీవీ శ్రీనివాసరావు, కోశాధికారిగా టి.గోపీనాథ్ ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 14 మంది కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రామకృష్ణయ్య , సలహాదారుడిగా టి. సురేష్‌బాబు వ్యవహరించారు.
![సయ్యద్ వజీరుద్దీన్ అధ్యక్షుడు 1](https://www.sakshi.com/gallery_images/2023/12/25/24vie42-310147_mr.jpg)
సయ్యద్ వజీరుద్దీన్ అధ్యక్షుడు
![2](https://www.sakshi.com/gallery_images/2023/12/25/24mcpm42-310107_mr_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment