మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నవంబర్ 13వతేదీన హైదరాబాద్‌లో నిర్వహించే బాలల లఘుచిత్రాల పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రెయిన్ బో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ కార్యదర్శి కె.మోహన్ బుధవారం ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 18ఏళ్ల లోపు బాలకళాకారులే ఈ లఘుచిత్రాల పోటీల్లో నటించాలని, చిత్రాల నిడివి 5 నుంచి 15 నిముషాల లోపు ఉండాలన్నారు. దరఖాస్తులను మెహన్‌ఫిల్మ్‌అకాడమీఃజీమెయిల్.కామ్ అనే మెయిల్ ఐడీకి నవంబర్ 7వ తేదీలోపుగా పంపాలని సూచించారు. దాశరథి ఫిలిం సొసైటీతో కలిసి సంయుక్తంగా ఈపోటీలను నిర్వహిస్తున్నామని ఇతర వివరాలకు సెల్‌నంబరు 89782 51150లో సంప్రదించాలని ఆయన కోరారు.
డీఎంఈ కార్యాలయంలో అగ్నిప్రమాదం
సాక్షి, అమరావతి: విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని డీఎంఈ కార్యాలయంలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 9 గంటల సమయంలో డీఎంఈ ఛాంబర్‌లోని ఏసీ యూనిట్‌లో షార్ట్‌సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు సోఫాపై పడటంతో మంటలు వ్యాపించాయి. విధుల్లో ఉన్న శానిటేషన్ సిబ్బంది కేకలు వేయడంతో అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైరింజిన్‌తో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో కార్యాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment