ఉత్సాహంగా జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా రోలర్ స్కేటింగ్ పోటీలు భవానిపురంలోని రోజ్ పార్క్‌లో బుధవారం ఉత్సాహభరితంగా సాగాయి. కృష్ణాజిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఇన్‌లైన్, క్వాడ్ స్పీడ్ స్కేటింగ్ విభాగంలో క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. 5–7, 7–9, 9–11, 11–14, 14–17, 17ఏళ్లు పైబడిన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఒక్కో వయసు కేటగిరీలో 20 మంది(ఇన్‌లైన్, క్వాడ్ విభాగాల్లో) మందికి ట్రోఫీలు అందజేశారు. పోటీల అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టుకు ఎంపికై న 120 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించారు. ముగింపు కార్యక్రమంలో ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి పి.థామస్, కార్పోరేటర్ బాపతి కోటిరెడ్డి, రోజ్ గార్డెన్ పార్క్ అధ్యక్షకార్యదర్శులు నర్సారెడ్డి, వి.ఎస్.కె.ప్రసాద్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో సంఘం చైర్మన్ దుర్గాప్రసాద్, అధ్యక్షకార్యదర్శులు దుర్గాప్రసాద్, శ్రీనివాసరెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి బచ్చు మురళీ, కోశాధికారి భువన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment