సెమీ ఫైనల్స్‌కు చేరిన జట్లు
విజయవాడ స్పోర్ట్స్:ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. పీబీ సిద్ధార్థ కాలేజీలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. ఆదివారం జరిగిన లీగ్ పోటీల బాలుర విభాగంలో విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కడప జట్లు, బాలికల విభాగంలో పశ్చిమగోదావరి, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయని ఎస్జీఎఫ్ అండర్ 19 కృష్ణా జిల్లా కార్యదర్శి వి.రవికాంత వెల్లడించారు. రెండో రోజు పోటీలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉషారాణి ప్రారంభించారు.
కార్తికేయుని సన్నిధిలో కార్తిక దీపోత్సవం
మోపిదేవి:కార్తికమాసం సందర్భంగా వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం కార్తిక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మండపంలో తెల్లవారుజామున మహిళా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. నాగమల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టుకుని స్వామివారిని తమ ఇష్ట కోర్కెలు కోరుకున్నారు.
ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు
డాక్టర్ కొల్లేటి రమేష్ ఎంపిక
మధురానగర్(విజయవాడసెంట్రల్):ఈ నెల 12 నుంచి 21 వరకు జరిగే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎన్టీఆర్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఎస్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం ప్రీ రిపబ్లిక్ డే పరేడ్, మహారాష్ట్రలోని జెల్గాన్ నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీలో జరగనుంది. 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాల ల నుంచి 44 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు (22 మంది బాయ్స్ 22 మంది గరల్స్) ఈ శిబిరానికి ఎంపికయ్యారన్నారు. సోమవారం వీరందరూ మహారాష్ట్ర బయలుదేరతారు. క్యాంపులో ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ తరగతులు పూర్తిచేసుకుని ఈ నెల 22 న తిరిగి వస్తారని చెప్పారు. అక్కడ ఎంపికై న వారు జనవరి 26న న్యూఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, జిల్లా ఆఫీసర్లు, పట్టణ ప్రముఖులు డాక్టర్ కొల్లేటి రమేష్, టీమ్‌ను అభినందించారు.
మంగినపూడి బీచ్‌లో భక్తుల స్నానాలు
కోనేరుసెంటర్: కార్తికమాసం పురస్కరించుకుని ఆదివారం మంగినపూడి బీచ్ కోలాహలంగా మారింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బీచ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు స్నానాలు ఆచరించిన అనంతరం దత్తాశ్రమాన్ని సందర్శించి 11 బావుల్లో స్నానాలు చేశారు. అనంతరం ఆలయాన్ని సందర్శించారు. స్నానాలు ఆచరించేందుకు పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున
మంగినపూడి బీచ్‌కు చేరుకోవడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పహారా కాశారు. భక్తులను అనుక్షణం అప్రమత్తం చేస్తూ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బందరు రూరల్ ఎస్‌ఐలు సత్యనారాయణ, నాగరాజు, మైరెన్ ఎస్‌ఐ మురళి సిబ్బందితో కలిసి పర్యాటకులను అనుక్షణం అప్రమత్తం చేశారు. చిన్నారులు కేరింతలు కొట్టగా, యువతీ యువకులు అలల మధ్య రెట్టింపు ఉత్సాహంతో సముద్రపు స్నానాలు చేశారు. బీచ్‌లో స్నానాలు అనంతరం దత్తాశ్రమంతో పాటు చిలకలపూడిలోని పాండురంగ స్వామి ఆలయాన్ని సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment