సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
కృష్ణలంక(విజయవాడతూర్పు): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీఓ నంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఎంబీ విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగభూషణ అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి లక్ష్మణరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారుతున్నా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల జీవితాల్లో మాత్రం మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ సెక్షన్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, వెటర్నరీ, మెకానిక్‌లు, మొక్కల పెంపకం తదితర విభాగాల్లో పని చేసే కార్మికులు ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారందరికీ ఏ విధమైన రక్షణ గానీ, భద్రత గానీ కల్పించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను శాసనమండలలో ప్రస్తావించి పరిష్కారానికి పీడీఎఫ్ పక్షాన తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంజినీ
రింగ్ కార్మికులను ఆదుకుంటామని, జీతాలు
పెంచుతామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం యాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఇంజినీరింగ్ కార్మికుల వేతనాల పెంపు ఇతర డిమాండ్లను పరిష్కరించే దిశగా మంత్రివర్గం నిర్ణయాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. డిసెంబర్ 2, 3 తేదీల్లో మునిసిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు, డిసెంబర్ 4,5,6 తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు రాయబారాలు, డిసెంబర్ 16న కలెక్టర్లకు సామూహిక రాయబారాలు నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం
స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. శ్రామిక మహిళా రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ కె.ధనలక్ష్మి, ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి ఎస్.జ్యోతిబసు, ఉపాధ్యక్షుడు నాయుడు, కార్యదర్శి బి.ముత్యాలరావు తదితరులు
పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
Comments
Please login to add a commentAdd a comment