బుడమేరు ఆధునికీకరణకు నిధులేవి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్.. బడుగు, బలహీన వర్గాలకు నిరాశ మిగిల్చింది. సంక్షేమాన్ని గాలికివదిలి ఆయా వర్గాల అభ్యున్నతిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనేందుకు ఈ బడ్జెట్టే ఉదాహరణ. పట్టణాభివృద్ధి పేరుతో అత్యధికంగా అమరావతి నిర్మాణానికి కేటాయించారు. రూ. రెండులక్షల పైచిలుకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వ్యవసాయానికి రూ.15వేల కోట్లు అవసరంకాగా కేవలం రూ.10వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం యువతలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి కేవలం రూ.నాలుగు వేల కోట్లు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదం.
–వేముల బేబిరాణి, హైకోర్టు అడ్వకేట్
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు ఏ విధంగా అమలు చేస్తారు? విద్యుత్ భారాల నుంచి ప్రజలకు ఏవిధంగా ఉపశమనం కలిగిస్తారన్న అంశాలను చర్చించలేదు. బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మరచిపోయింది. సొంత డప్పు కొట్టుకోవడానికే అఽధికార పార్టీ పరిమితమైంది.
– దోనేపూడి శంకర్, సీపీఐ
రెండు నెలల క్రితం వచ్చిన బుడమేరు వరదల ప్రభావానికి నగర ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ప్రభుత్వం బుడమేరు వరద నివారణకు చర్యలు చేపడతాం.. భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూస్తామని ప్రభుత్వం ఊదరగొట్టింది. తీరా బడ్జెట్‌లో బుడమేరు వరద నివారణకు నిధులు కేటాయించలేదు. –అవుతు శ్రీశైలజ, డెప్యూటీ మేయర్
అంకెల గారడీనే..
ప్రజా సంక్షేమాన్ని మరిచారు
Comments
Please login to add a commentAdd a comment