భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం
విజయవాడ కల్చరల్: భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఇక్కడి ఆదర్శ జీవన విధానమే అందుకు కారణమన్నారు. విజయవాడ ఋషిపీఠం, భారతీయ సనాతన ధర్మవేదిక ఆధ్వర్యంలో విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య కళాశాలలో ‘మన కోసం మన పురాణాలు’ అంశంగా నిర్వహిస్తున్న ప్రసంగాలు బుధవారం ఐదో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా సామవేదం షణ్ముఖశర్మ మాట్లాడుతూ.. సుఖ జీవనం కన్నా ధర్మ జీవనం గొప్పదని పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. నేటి సమాజంలో విలువలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు పుణాల్లో వివరిస్తున్న అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సత్యహరిశ్చంద్రుని కథను ప్రస్తాస్తూ భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆదర్శజీవనం గురించి వివరించారు. శాకంబరీ అవతారాన్ని గురించి వివరిస్తూ కాశీ అన్న పూర్ణతత్వంతో సమన్వయం చేయడం హృద్యంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని బహుగ్రంథకర్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ సమన్వయ పరిచారు. కార్యక్రమంలో మాజీ మేయర్, జంధ్యాల శంకర్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment