సీఎస్‌కు వేద ఆశీర్వచనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.విజయానంద్‌కు దుర్గగుడి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. తొలుత ఆలయ వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు విజయానంద్‌కు ఆశీర్వచనం పలకగా, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కె.సత్యనారాయణ, దుర్గగుడి ఇన్‌చార్జి ఈఓ కె.రామచంద్ర మోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. డెప్యూటీ ఈఓ రత్నరాజులతోపాటు ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్.డి.ప్రసాద్, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి కురాష్ పోటీలకు చిన్మయి
గన్నవరం: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని మానికొండ సాయిసత్య చిన్మయి జాతీయ స్థాయి కురాష్ పోటీలకు ఎంపి కైనట్లు ప్రధానోపాధ్యా యిని డి.ఝాన్సీరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కడప జిల్లా కోడూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–17 విభాగంలో చిన్మయి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నట్లు పేర్కొన్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు ఈ నెల రెండు నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. చిన్మయిని హెచ్‌ఎంతో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment