స్నోయగం
భవానీఘాట్ ప్రాంతాన్ని కమ్మేసిన పొగమంచు
పొగమంచులో కనువిందు చేస్తున్న కృష్ణమ్మ
మంచుదుప్పటి కమ్మేసింది. దారి కూడా కనిపించనంతగా దట్టంగా వ్యాపించింది. ఉదయం ఎనిమిది గంటల తరువాత కూడా లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించాల్సి వచ్చింది. పొగమంచులో సూర్యోదయం ప్రకృతి కాన్వాస్‌పై సరికొత్త అందాన్ని ఆవిష్కరించింది. లేలేత సూర్యకిరణాల వెలుగులో కృష్ణానది పరిసరాలు ఆ అందాలకు మరింత వన్నెతెచ్చాయి. ఈ దృశ్యాలు బుధవారం ఉదయం విజయవాడ నగరంలోని భవానీఘాట్ వద్ద కనువిందు చేశాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
మంచు తెరలను చీల్చుకుని వస్తున్న భానుడు
Comments
Please login to add a commentAdd a comment