జాతీయ పోటీల్లో సత్తా చాటండి
విజయవాడస్పోర్ట్స్: జాతీయ జూడో పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని జూడో రాష్ట్ర సీ్త్ర, పురుషుల జట్లకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఎండీ గిరీషా సూచించారు. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి సీనియర్ సీ్త్ర, పురుషుల జూడో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలను రాష్ట్ర జట్లకు ఎంపిక చేశారు. ఈ జట్లకు కిట్‌లను శాప్ కార్యాలయంలో ఎండీ గిరీషా గురువారం అందజేశారు. ఈ నెల నాలుగు నుంచి ఏడో తేదీ వరకు ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అత్యున్నత క్రీడా నైపుణ్యాన్ని జాతీయ పోటీల్లో ప్రదర్శించాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సీఈవో నామిశెట్టి వెంకట్ అధ్యక్ష, కార్యదర్శులు గణేష్ సుబ్బారావు, పవన్ సందీప్ పాల్గొన్నారు.
జూడో రాష్ట్ర జట్టుతో శాప్ ఎండీ గిరీషా
Comments
Please login to add a commentAdd a comment