ఉపాధిపై దెబ్బ కొట్టారు
మా కుటుంబం మూడు తరాలుగా కల్లు గీసుకుంటున్న తాటి చెట్టును అక్రమంగా నరికేసి వాగులో పడేశారు. చెట్టుకు కల్లు
కుండలు వేలాడుతూ ఉండగానే మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నరికేయడం దుర్మార్గం. దీనిపై ప్రశ్నిస్తే రహదారికి అడ్డొచిందని నరికేశామని, చేతనైనంది చేసుకోమని బెదిరిస్తున్నారు.
–కాగితాల శ్రీను,
కల్లుగీత కార్మికుడు, జి.కొండూరు
దొర్లింతాల వాగుతో పాటు పక్కనే ఉన్న సహకార బ్యాంకు స్థలంలో నుంచి రహదారి వేశారు. రైతులు వెళ్లేందుకు ఇంకొక రహదారి ఉంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కల్లుగీత తాటిచెట్టును నరికేశారు. దశాబ్దాల చరిత్ర ఉన్న చెట్లను నరికేశారు. ఈ రహదారిని దౌర్జన్యంగా ఏర్పాటు చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.
–ఎస్.గోపి, గడ్డమణుగు గ్రామస్తుడు
Comments
Please login to add a commentAdd a comment