కోనేరు హంపికి ఘన స్వాగతం
విజయవాడస్పోర్ట్స్: ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుని స్వస్థలానికి చేరుకున్న కోనేరు హంపికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) స్పోర్ట్స్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, మహేష్, కోచ్‌లు భాస్కర్, జగదీష్, సంతోష్, ముంతాజ్‌బేగం, ఇసాక్, స్వామి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. విజయవాడ నగ రానికి చెందిన పలువురు చెస్ క్రీడాకారులు, చెస్ క్రీడాభిమానులు ప్లకార్డులతో ఆమెకు ఆత్మీయ స్వాగతం చెప్పారు.
విజయవాడకు చెందిన హంపి రెండో సారి ప్రపంచ చాంపియన్ టైటిల్ సొంతం చేసుకుని నగర ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. రెండు సార్లు ప్రపంచ చాంపియషిప్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె కీర్తికెక్కింది. చదరంగం క్రీడా చరిత్రలో ఆమె అత్యున్నత స్థాయికి చేరడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్న హంపికీ శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, ఎండీ పి.ఎస్.గిరిషా శనివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment