విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Sun, Jan 5 2025 1:41 AM | Last Updated on Sun, Jan 5 2025 1:41 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2025

7

నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన బేహేరా సుదం రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.

–8లోu

పరిశ్రమల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టండి

కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మంది రంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల భద్రత కమిటీ సమావేశం శనివారం జరిగింది. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. అన్ని పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నమోదైన 47 ఫ్యాక్టరీల్లో 44,096 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వారి భద్రతకు ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కర్మా గారంలో ప్రమాదాలకు కారణమయ్యే లోపాలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చే కార్మికులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఫ్యాక్ట రీల్లో ఫైర్‌, పోలీస్‌ శాఖలు మాక్‌ డ్రిల్‌ నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. సేఫ్టీ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని పరిశ్రమల యాజమాన్యాలను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డిస్ట్రిక్ట్‌ క్రైసైస్‌ గ్రూప్‌ కమిటీ కన్వీనర్‌ డెప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఎం.వి.శివకుమార్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ టి.రాజు, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీ సర్‌ ఎ.వి.శంకరరావు, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, తదితర పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

పశు వైద్యశాలలకు

మందుల పంపిణీ

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలోని పశు వైద్యశాలలకు మొదటి త్రైమాసికానికి సంబంధించి రూ.57 లక్షల విలువైన 200 రకాల మందులను ముత్యాలంపాడు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఎం.హనుమంతరావు క్షేత్ర స్థాయి సిబ్బందికి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పశు వైద్యశాలలో ఈ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్‌ వి.గోపీచంద్‌, డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శాశ్వత నిర్మూలనకు చర్యలేవి?

మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా నాటుసారా తయారీ జరుగుతున్నప్పటికీ శాశ్వతంగా నిర్మూలించడంలో ప్రభుత్వంవిఫలమవుతోంది. కేవలం ఒకరిద్దరూ అధికారులు నాటుసారాపై సమర్థంగా దాడులు నిర్వహించడం మినహా శాశ్వత నిర్మూలకు తీసుకోవాల్సిన చర్యలపై ఎటువంటి పురోగతి లేకనే నాటుసారా రాజ్యమేలుతోందని విమర్శలు వస్తున్నాయి. తయారీదారులు, విక్రయదారులపై కఠినమైన శిక్షలు అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపి, నిరంతర నిఘా ఉంచితే తప్ప ఈ నాటుసారాని అదుపుచేయడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జి.కొండూరు: పల్లెల్లో నాటుసారా వాసన గుప్పుమంటోంది. మద్యం ధరలు తగ్గిస్తామంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అధిక ధరలకు మద్యం కొనలేని మందుబాబులు సారా కిక్కును ఆశ్రయిస్తున్నారు. డిమాండ్‌ అమాంతం పెరగడంతో విచ్చలవిడిగా సారా తయారీ కేంద్రాలు వెలిశాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో నాటుసారా తయారీకి పేరు పొందిన తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో సారా గుప్పుమంటోంది. ఎకై ్సజ్‌ అధికారులు చేపడుతున్న తనిఖీల్లో రోజూ వేల లీటర్ల బెల్లం ఊట బయటపడటమే ఇందుకు నిదర్శనం. పూర్వం సంప్రదాయ పద్ధతుల్లో బెల్లం, పండ్లు, చెట్ల బెరడు, ఆకులను కుండల్లో నింపి భూమిలోపల ఉంచి వారం రోజులు ఊరిన తర్వాత ఆ పదార్థాన్ని కాచి దాని నుంచి వచ్చిన ఆవిరిని చల్లార్చి సారా తయారు చేసేవారని సమాచారం. ఆ తర్వాత బెల్లం, పటిక, అమోనియా, బత్తాయి తదితర పండ్లను వినియో గించి సారా తయారు చేసేవారని తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం ధరలు చుక్కలు చూపిస్తుండడంతో నాటుసారాకు డిమాండ్‌ పెరిగింది. బెల్లంతో పాటు వ్యవసాయంలో వినియోగించే యూరియా, అమోనియా వంటి రసాయనిక ఎరువులు, ఇతర మత్తు పదార్థాలు, టాబ్లెట్‌లను కలిపి పెద్ద పెద్ద ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో రెండు మూడు రోజులు మాత్రమే ఊరబెట్టి నాటుసారా తయారు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

గతంలో సారా తాగి 21మంది మృతి

మైలవరం మండలంలోని నాగులూరు తండా, కనిమెర్ల తండా, పోరాటనగర్‌ తండాల్లో 2012వ సంవత్సరం జనవరిలో నాటుసారా మరణాలు పెద్ద విషాదాన్ని నింపాయి. ఈ మూడు గ్రామాలకు చెందిన 21మంది నాటుసారా రక్కసికి బలయ్యారు. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ వెంటనే పోలీసులు దాడులు జరిపి సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడంతో పాటు తయారీదారులు, విక్రయ దారులపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో నాటుసారా తయారీ తగ్గినప్ప టికీ రెడ్డిగూడెంనకు సరిహద్దుగా ఉన్న విస్సన్నపేట మండలంలో తయారైన సారాను రెడ్డిగూడెం, మైలవరం మండలాల్లో విక్రయిస్తున్నారు.

రెండు నియోజకవర్గాల్లో..

తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలంలో వేమిరెడ్డిపల్లి, చండ్రుపట్ల, తాతకుంట్ల, ఎ.కొండూరు మండలంలోని గొల్లమందల, కుమ్మరి కుంట్ల, రేపూడి తండా, గంపలగూడెం మండలంలోని అమ్మిరెడ్డిగూడెం, మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో అన్నేరావుపేట, కూనపురాజుపర్వ, రెడ్డిగూడెం, శ్రీరాంపురం, రుద్రవరం, వంటి గ్రామాల్లో ప్రతిరోజూ ఎకై ్సజ్‌ పోలీసులు జరుపుతున్న దాడుల్లో సారా తయారీకి వినియోగించే ప్రధాన ముడిపదార్థమైన బెల్లం ఊటను వేల లీటర్లు ధ్వంసం చేస్తున్నారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న సారాను స్వాధీనం చేసుకుంటున్నారు.

నాటుసారా

నిర్మూలనే లక్ష్యం

నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నాం. సారా తయారీ దారులు, విక్రయదారులపై పీడీ యాక్టులు పెడుతున్నాం. పాత నేరస్తు లను బైండోవర్‌ చేస్తున్నాం. తిరువూరు నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో ఈ నాటుసారా తయారీ, విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 18 వేల లీటర్లకు పైగా బెల్లం ఊటను ధ్వంసం చేశాం. పాత నేరస్తులు 26 మందికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి చూపించాం. నాటుసారా వల్ల కలిగే నష్టాలపై గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

– జె.శ్రీనివాస్‌,

ఎకై ్సజ్‌ సీఐ, మైలవరం, తిరువూరు

ఇటీవల ఎకై ్సజ్‌ అధికారులు ధ్వంసం చేసిన బెల్లం ఊట, సారా, కేసుల వివరాలు

న్యూస్‌రీల్‌

యథేచ్ఛగా సారా తయారీ, విక్రయాలు మద్యం ధరలు తగ్గకపోవడంతో సారా వైపు చూస్తున్న మందుబాబులు డిమాండ్‌ మేరకు పెద్ద ఎత్తున తయారీ శాశ్వత నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు శూన్యం

మొత్తం నాటుసారా కేసులు 66

సారా తయారీదారుల సంఖ్య 60

స్వాధీనమైన నాటుసారా 391 లీటర్లు

ధ్వంసం చేసిన బెల్లంఊట 18,870

లీటర్లు

స్వాధీనం చేసుకున్న వాహనాలు 06

నాటుసారా ముద్దాయిల బైండోవర్‌లు 80

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/9

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/9

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement