పాలిటెక్ ఫెస్ట్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో అద్భుతాలు సాధించగలరని, ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.గణేష్‌కుమార్ అన్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే పాలిటెక్ ఫెస్ట్‌ను ఆయన సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్‌కుమార్ మాట్లాడుతూ.. 2018లో పాలిటెక్ ఫెస్ట్ నిర్వహణకు శ్రీకారం చుట్టామని, అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్లాగ్‌షిప్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ 107 పాలిటెక్నిక్ కాలేజీల నుంచి 249 ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ వి.పద్మారావు, ఏయూ రీజియన్ ఆర్‌జేడీ జె.సత్యనారాయణమూర్తి, ఎస్‌వీయూ రీజియన్ ఆర్‌జేడీ ఎ.నిర్మలకుమార్ ప్రియ, ఎస్‌బీటెట్ సెక్రటరీ జి.వి.రామచంద్రారావు, డాక్టర్ ఎం.ఎ.విజరామకృష్ణ, కె.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment