దర్గా ఉరుసుకు విస్తృత ఏర్పాట్లు
ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లిలో చారిత్రక నేపథ్యం కలిగిన షాబూఖారీ దర్గా 428వ ఉరుసుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు దర్గా పీఠాధిపతి మహ్మద్ అల్తాఫ్‌రజా తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ టి.నాగరాజుతో కలసి సోమ వారం పరిశీలించారు. ఈ సందర్భంగా అల్తాఫ్‌రజా మాట్లాడుతూ.. ఏటా వైభవంగా జరిగే ఉరుసుకు కులమతాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. భక్తుల భద్రత కోసం పోలీస్ బందో బస్తు కోరామన్నారు. మూడురోజులు భక్తులకు అన్న సంతర్పణ చేస్తామన్నారు. చిన్నారులు, వృద్ధులు దర్గాకు వెళ్లేదుకు అడ్డుగా ఉన్న ప్రహరీని సీఈ నాగరాజు సమక్షంలో తొలగించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ఏర్పాటు చేస్తామని అల్తాఫ్‌రజా తెలిపారు.
సెమెన్ బ్యాంక్‌ను సందర్శించిన పశుసంవర్ధక శాఖ అధికారి
గన్నవరం: స్థానిక పశుగణాభివృద్ధి సంస్థ (సెమెన్ బ్యాంక్) కార్యాలయాన్ని పశుసంవర్ధక శాఖ కృష్ణా జిల్లా అధికారి డాక్టర్ ఎన్.నర సింహులు సోమవారం సందర్శించారు. సెమెన్ బ్యాంక్ ఆవరణలో పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుని కార్యాలయ నిర్మాణానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల ఎనిమిది, తొమ్మిదో తేదీల్లో కేంద్ర లైవ్‌స్టాక్ సెన్సెస్ జాయింట్ సెక్రటరీ గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, జాయింట్ సెక్రటరీకి అవసరమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. అల్లాపురం పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.వి. బాలకృష్ణారావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వంతో
కేసుల పరిష్కారానికి కృషి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక
విజయవాడస్పోర్ట్స్: మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక సూచించారు. విజయవాడ సివిల్‌కోర్టుల ప్రాంగణంలో న్యాయాధికారులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమం సోమవారం మొదలైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారమనేది పురాతనకాలం నుంచే వస్తోందన్నారు. తక్కువ సమయంలో కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతగానో దోహదపడుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నిపుణులైన బీనాదేవరాజ్ (బెంగళూరు), సురేందర్‌సింగ్ (ఢిల్లీ)తో జిల్లాలోని 24 మంది న్యాయాధి కారులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని న్యాయస్థానాల సమయాన్ని ఆదా చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment