రెవెన్యూ సదస్సుల అర్జీలపై దృష్టిపెట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను నిర్దేశ గడువులోగా పరిష్కరించాల్సిందేనని.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 120 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించి 44, మునిసిపల్‌కు సంబంధించి 15, పోలీస్ 14, పంచాయతీరాజ్ 11, డీఆర్‌డీఏ ఏడు, విద్య ఐదు, లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు నాలుగు అర్జీలు వచ్చాయి. వైద్య ఆరోగ్యానికి, మార్కెటింగ్ శాఖలకు మూడు చొప్పున రాగా ఎండోమెంట్స్, గృహ నిర్మాణ శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. ఏపీ సీపీడీ సీఎల్, ఏపీఎస్‌ఆర్‌టీసీ, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, ఉపాధి కల్పన, మత్స్య, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ శాఖలకు ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలను నిర్దేశ గడువులోగా పరిష్కరించేందుకు కృషిచేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు మరింత క్రియా శీలంగా పనిచేయాలన్నారు. సమన్వయ శాఖల అధికారుల భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పీజీఆర్‌ఎస్‌కు 120 అర్జీలు
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
అర్జీదారుల సమస్యలను ఆలకిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన దొంతమాల వెంకమ్మ(84) మంచాన పడి లేవలేని స్థితిలో ఉంది. ఆదాయం లేదు. బాగోగులు చూసేవారు లేరు. మందులకు కూడా లేని పరిస్థితి. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆమె బంధువులు అర్జీ సమర్పించారు.
సంక్రాంతి సందర్భంగా గ్రామంలో కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. కోడిపందాల వల్ల గ్రామంలోని ప్రశాంత వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని అర్జీలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment