11న బేవరేజెస్ డిపోలో బహిరంగ వేలం పాట
రామవరప్పాడు: ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఏపీ స్టేట్ బేవరేజెస్ డిపో పరిధిలోని ప్రభుత్వ మద్యం షాపులకు సంబంధించి వివిధ వస్తువులకు ఈనెల 11న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.సునీత శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేలం పాటలో 60 ఫీజర్స్ (ఒక్కొక్కటి నిర్ణయించిన ధర రూ.18,900), 61 బ్యాటరీ ఇన్వర్టర్లు (నిర్ణయించిన ధర రూ.15,525), 78 గోద్రెజ్ క్యాష్ చెస్ట్‌లు (నిర్ణయించిన ధర రూ.2,837), 65 క్యాష్ కౌంటింగ్ మిషన్లు (నిర్ణయించిన ధర రూ.657) వేలం వేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 90004 76476, 91771 17734 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
నవదిన ప్రార్థనలు ప్రారంభం
ఉంగుటూరు: జోసఫ్ తంబివలే దేవుని ప్రేమను తెలుసుకుని అందరూ ప్రేమతో జీవించాలని వికార్ ఫోరెన్, గన్నవరం విచారణ ఫాదర్ పసల తోమస్ అన్నారు. మండలంలోని పెద్ద అవుటపల్లిలో ఉన్న బ్రదర్ జోసఫ్ తంబి క్షేత్రంలో నవదిన ప్రార్థనలు శనివారం ప్రారంభమయ్యాయి. తంబి సమాది వద్ద మహోత్సవాల పతాకావిష్కరణ చేసి, నవదిన ప్రార్థనలు తోమస్ ప్రారంభించారు. దేవుని ప్రేమను గురించి బోధించారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లూర్ధునగర్ వాసులు భక్తి శ్రద్ధలతో కొనియాడారు. ఈ కార్యక్రమంలో విచారణ ఫాదర్ అభిలాష్, సహాయక గురువు, మఠకన్యలు, సంఘస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment