చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సువర్ణను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం పీడీ కార్యాలయాన్ని మచిలీపట్నంలో కాకుండా కానూరులోని కార్యాలయంలో నిర్వహించటంతో ప్రజలకు జిల్లా అధికారి అందుబాటులో లేకుండా పోయారు. దీనిపై పలు ఫిర్యాదులు రాష్ట్ర కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు కార్యాలయాన్ని జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని పలుమార్లు రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆమె కార్యాలయాన్ని మార్పు చేయలేదు. దీంతో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఆదేశానుసారం ఆమెను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment