గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అండర్–19 బాలికల స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల ఆరు నుంచి పదో తేదీ వరకు జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీలను విజయవంతం చేయా లని కోరారు. పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పోటీల నిర్వహణ కమిటీల సమావేశం గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. వాలీబాల్ పోటీలు పీబీ సిద్ధార్థ కళాశాల మైదానంలో జరుగుతాయన్నారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు మాట్లాడుతూ.. ఈ జాతీయపోటీల్లో 26 రాష్ట్రాల బాలికల జట్లు పొల్గొంటాయని, అన్ని రాష్ట్రాల జట్లకు ఉచిత బస ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కార్యదర్శి వి.రవికాంత మాట్లాడుతూ.. పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలుగు నుంచి పది గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్కూల్ గేమ్స్ సంయుక్త కార్యదర్శి కె.వి.రాధాకృష్ణ, ఎ.పి.రాజు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment