కూటమి నేతల బరితెగింపు
కంచికచర్ల (నందిగామ): నానాటికీ కూటమి నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రాజకీయ కక్షల నేపథ్యంలో ఏ ఆధారంలేని ఒంటరి మహిళ లనూ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారనడానికి.. ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న మహిళను నడిరోడ్డు పాలుజేయడమే నిదర్శనంగా నిలుస్తోంది. బాధితురాలి కథనం మేరకు.. గండేపల్లి ఎంపీపీ పాఠశాలలో ఐదేళ్లుగా ఆయాగా పనిచేస్తున్న ఒంటరి మహి ళ గట్టిగుండె ఇందిరను కూటమి నాయకుల ఒత్తిడితో విద్యాశాఖ అధికారులు విధుల నుంచి అకస్మాత్తుగా తొలగించారు. రోజూ పాఠశాలకు వెళ్లి తరగతి గదు లను, మరుగుదొడ్లను శుభ్రం చేసి, విద్యార్థులు ఉపా ధ్యాయులకు తాగునీటిని ఏర్పాటు చేసే ఆమెను విధుల్లోకి రావద్దని గురువారం ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు మేరుగ రామారావు ఆదేశించడంతో అవాక్కయింది. విధులకు రాకపోతే ఒంటరి మహిళనైన తన జీవనం ఎలాగని ఇచ్‌చార్జి హెచ్‌ఎంను ప్రశ్నించింది. వేరొక మహిళను ఈ విధుల్లోకి తీసుకోవాలని ఎంఈఓ బి.బాలాజీనాయక్ ఫోన్ చేసి చెప్పారని హెచ్‌ఎం బదులిచ్చారు. దీంతో దిక్కు తోచని ఒంటరి మహిళ తనను విధుల్లో నుంచి తొలగించడం దారుణమని, తాను అందరిలా ఎంఈఓకు ముడుపులు ఇచ్చుకోలేనని, తనకు జీవనాధారం కల్పించాలని వేడుకుంటూ హెచ్‌ఎం గది ఎదుట ఆందోళనకు దిగింది. కాగా, ఈ విషయమై ఎంఈఓ బాలాజీనాయక్‌ను వివరణ కోరగా.. ఎస్‌ఎంసీ కమిటీ ఆయాను తొలగించాలని తీర్మానం చేసినందునే తొలగించామని తెలిపారు.
ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న
పాఠశాల ఆయా తొలగింపు
ఇన్‌చార్జి హెచ్‌ఎం గది ఎదుట
బాధితురాలి ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment