ఈఎస్‌ఐ రీజినల్ డైరెక్టర్‌గా రామారావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) విజయవాడ ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డైరెక్టర్‌గా ఎం.రామారావు, జాయింట్ డైరెక్టర్‌గా ప్రణవకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈఎస్‌ఐ లబ్ధిదారుల కోసం ఆరోగ్య అవగాహన, ఆధార్ సీడింగ్ శిబిరాలు ఏర్పాటు చేసి, అవగాహన పెంచే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్మికుల సామాజిక భద్రత అవస రాలను తీర్చిడం, మెరుగైన ఆరోగ్య సేవలను అందించడం, ప్రాథమిక ఆరోగ్య సేవలను పెంచడంపై దృష్టి పెడతామన్నారు. రాష్ట్రంలోని 54 లక్షల మంది చందాదారులకు ఈఎస్‌ఐ ఆస్పత్రులు, ఔషధ కేంద్రాల ద్వారా అధిక నాణ్యతతో వైద్య సేవలు అందించడంలో సహాయం చేస్తామన్నారు.
హెల్త్ వర్సిటీ టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ మహిళల జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి బుధవారం ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభచాటిన కె.మేఘన (గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్, శ్రీకాకుళం), వి.శ్రీకరి (గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్, శ్రీకాకుళం), యు.రుషిత (గాయత్రి మెడి కల్ కాలేజీ, విశాఖపట్నం), వి.శ్రీనవ్య తేజశ్విని (గాయత్రి మెడికల్ కాలేజీ, విశాఖ), బి.జయశ్రీ (జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ, విశాఖపట్నం) జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ నెల మూడు నుంచి ఐదో తేదీ వరకు చెన్నయ్‌లోని ఏఎంఈటీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జరిగే దక్షిణ భారత టీటీ పోటీలకు ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. జట్టుకు ఎంపిౖకైన క్రీడాకారులను వర్సిటీ ప్రాంగణంలో వీసీ డాక్టర్ డి.ఎస్.వి. ఎల్.నరసింహాం, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ సి.హెచ్.శ్రీనివాసరావు అభినందించారు.
వైభవంగాధనుర్మాస మహోత్సవాలు
తాడేపల్లి రూరల్ : త్రిదండి చిన్న జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం మంగళగిరి బాపూజీ విద్యాల యంలో 17వ రోజు 17వ పాశురాన్ని భక్తులకు ఆయన వివరించారు. అనంతరం గోదా అమ్మవారికి అష్టోత్తరం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. త్రిదండి చిన్న జీయర్‌స్వామి స్వయంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మనిషి ప్రవృత్తి, విధి విధానాలు, భగవంతునిపై ఉండవలసిన నిష్ట, ఏ విధంగా ఆచరణలో పెట్టాలో వివరించారు. 14 ప్రాంతాల నుంచి సుమారు 340 మంది భక్తులు గోదా అమ్మవారికి సారె సమర్పించారు. తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి.
యార్డులో 44,245 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 40,208 మిర్చి బస్తాలు వచ్చాయి. నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానంలో 44,245 బస్తాలను విక్రయించారు. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి క్వింటా సగటు ధర రూ.7,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాలకు సగటు ధర రూ.7,500 నుంచి రూ.16,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం రూ.7,500 నుంచి రూ. 13,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ.7,800 నుంచి రూ.16,500 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చి క్వింటా ధర రూ.4 వేల నుంచి రూ.11,000 వరకు పలికింది. విక్ర యాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 47,476 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment