‘టిడ్కో’ నిర్మాణానికి ఆ భూములు సేకరించొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వం సేకరిస్తున్న భూములు కొద్దిపాటి వర్షానికే మునిగిపోతాయని, వాటిని సేకరించొద్దని ఆ గ్రామానికి చెందిన మెండెం జమలయ్య, చింతా సుధాకర్ తదితరులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించారు. సోమవారం కలెక్టరేట్‌లో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. ఇన్ చార్జి కలెక్టర్ నిధిమీనా, డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొత్తూరు తాడేపల్లి వద్ద సేకరిస్తున్న భూములు కొద్దిపాటి వర్షానికి మునిగిపోతాయని డీఆర్వోకు వివరించారు. గద్దె కాలువ, పంపు హౌస్, కిచ్చయ్య గుంట, కౌవులూరు రోడ్డు వరకు భూములు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వరదల్లో మునిగిపోయాయని, దీని దృష్ట్యా కొత్తూరు తాడేపల్లిలోనే పోలవరం కాలువ వైపు ప్రభుత్వ భూములను సేకరించాలని కోరారు.
● వరద ముంపునకు గురైన తన పొలానికి ప్రభుత్వం పరిహారం అందించలేదని, వ్యవసాయ శాఖ సిబ్బంది ఇష్టానుసారం నష్టం అంచనాలు రూపొందించారని జి.కొండూరు మండలంలో సున్నంపాడుకు చెందిన రైతు షేక్ బాబూ సాహెచ్ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు.
అర్జీలను వెంటనే పరిష్కరించండి
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినకొత్తూరు తాడేపల్లి గ్రామస్తులు 123 అర్జీల స్వీకరణ
పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందజేత
పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 123 అర్జీలు వచ్చాయని ఇన్‌చార్జి కలెక్టర్ నిధి మీనా తెలిపారు. వీటిలో రెవెన్యూ 48, పోలీస్ 19, మున్సిపల్ 13, వైద్యఆరోగ్యం 5, మార్కెటింగ్ 5, విద్య 5, పంచాయతీరాజ్ 4, గృహనిర్మాణం 3, ఉపాధికల్పన 3, పౌర సరఫరాలు 2, ఆర్ అండ్ బీ 2, డీఆర్‌డీఏ 2, మైన్స్ అండ్ జియాలజీ 2, ఏపీసీపీడీసీఎల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఎస్‌సీ కార్పొరేషన్, మైనారిటీ సంక్షేమం, సహకార, సర్వే, వ్యవసాయం, దేవదాయ, సాంఘిక సంక్షేమం, పరిశ్రమల శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment