నేటి నుంచి భవానీ దీక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భవానీ దీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మండలం పాటు దీక్షలను ఆచరించే భక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి 15వ తేదీ వరకు దీక్షలను స్వీకరించనున్నారు. భక్తులు భవానీ దీక్షలను స్వీకరించేందుకు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద, ఘాట్‌రోడ్డు ఆరంభంలోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి ఆలయంతో పాటు గురు భవానీల పీఠాల వద్ద దీక్షలను స్వీకరించవచ్చునని ఆలయ వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి చెప్పారు. అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మహా మండపం ఆరో అంతస్తు వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. అర్చకులు, గురుభవానీల చేతుల మీదగా భకులు దీక్షాధారణ చేపడతారు.
6వ అంతస్తులో ఉత్సవమూర్తి, ఘాట్‌రోడ్డు ఆరంభంలో కామథేను అమ్మవారి వద్ద దీక్షల స్వీకరణ 15 వరకు మండల దీక్షల ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment