శబరిమలకు 16 ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

శబరిమలకు 16 ప్రత్యేక రైళ్లు

Published Wed, Nov 20 2024 2:03 AM | Last Updated on Wed, Nov 20 2024 2:03 AM

-

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి – కొల్లం(07143) డిసెంబర్‌ 6, 13, 20, 27(శుక్రవారాలు) తేదీల్లో ఉదయం 11.30 గంటలకు మౌలాలిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07144) డిసెంబర్‌ 8, 15, 22, 29(ఆదివారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మౌలాలి చేరుకుంటుంది.

మచిలీపట్నం టు కొల్లం

మచిలీపట్నం – కొల్లం(07145) డిసెంబర్‌ 2, 9, 16(సోమవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07146) డిసెంబర్‌ 4, 11, 18(బుధవారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం – కొల్లం(07147) డిసెంబర్‌ 23, 30(సోమవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07148) డిసెంబర్‌ 25, జనవరి 1(బుధవారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల దారి మళ్లింపు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని గన్నవరం – ముస్తాబాద్‌, చేబ్రోలు సెక్షన్‌లో జరుగుతున్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి 23, 25 నుంచి 30 వరకు దన్‌బాద్‌ – అలప్పుజ(13351), ఈ నెల 21, 28 తేదీల్లో టాటా – యశ్వంత్‌పూర్‌(18111), ఈ నెల 20, 27 తేదీల్లో జసిదీహ్‌ – తాంబరం(12376), ఈ నెల 23, 30 తేదీల్లో హతియ – బెంగళూరు(18637), ఈ నెల 22, 29 తేదీల్లో టాటా – బెంగళూరు(12889), ఈ నెల 25న హతియ – యర్నాకులం(22837), ఈ నెల 19, 26 తేదీల్లో హతియ – బెంగళూరు(12835), ఈ నెల 28న విశాఖపట్నం – షిర్డీ సాయినగర్‌(18503), ఈ నెల 29న విశాఖపట్నం – హజరత్‌ నిజాముద్దీన్‌(12803) రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement