విజయవాడస్పోర్ట్స్: పౌండ్రీ కార్మికుడిని లారీతో ఢీ కొట్టి, అతని మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ విజయవాడ మూడో అడిషనల్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పి.తిరుమలరావు మంగళవారం తీర్పునిచ్చారు. ఎనికేపాడులోని ఓ పౌండ్రీలో స్టోర్ కీపర్‌గా పని చేసిన తిరుమలరావును అదే ప్రాంతంలోని హైవేపై గన్నవరం నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సహోద్యోగి అప్పారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 2017 జూన్ ఏడో తేదీన జరిగిన ప్రమాదంలో తిరుమలరావు అక్కడికక్కడే మరణించాడు. నిర్లక్ష్యంగా లారీని నడిపి తిరుమలరావు మృతికి కారణమైన లారీ డ్రైవర్ వాడపల్లి బాలజోజప్పను పటమట పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ప్రాసిక్యూషన్ తరుఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.గంగాధర్ కోర్టుకు వాదనలు వినిపించారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో లారీ డ్రైవర్‌కు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment