రీచ్‌ల నుంచే యథేచ్ఛగా తెలంగాణకు తరలుతున్న ఇసుక
వనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం శ్రీకాకుళంలో రెండుచోట్ల ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతివ్వగా మూడు రోజుల క్రితమే తవ్వకాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. సహజ వనరులను దోచుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని అలాంటివారు మాపార్టీ వారైనా వారిపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వేదికల మీద చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా రాత్రివేళలో సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్న దివిసీమలోని సాగునీటిని ప్రధాన ఆధారమైన పులిగడ్డ అక్విడెక్టుకు కూతవేటు దూరంలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లతో అక్రమ ఇసుర రవాణా చేస్తున్నారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల వరకూ కృష్ణానదికి ఆనుకుని ఉన్న ప్రతిగ్రామంలో అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. చల్లపల్లి మండలం నిమ్మగడ్డ, వెలివోలు, ఆముదార్లంక, ఘంటసాల మండలం పాపవినాశనం మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, పెదకళ్ళేపల్లి, నాగాయతిప్ప, అవనిగడ్డ మండలం పులిగడ్డ, దక్షిణ చిరువోలులంక, కోడూరు మండలం విశ్వనాధపల్లి, కుమ్మరిపాలెం, నాగాయలంక మండలం టి.కొత్తపాలెం, నాగాయలంక, మనుషులతో కాకుండా ప్రొక్లెయిన్ల ద్వారా ట్రాక్టర్లలోకి లోడు చేసుకుని తరలించేస్తున్నారు. చల్లపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జర్నలిస్ట్‌లపై అక్రమ ఇసుకదందా చేస్తున్న వారు దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగమంతా భయపడిపోతుండటం గమనార్హం.
అవనిగడ్డలో ఆగని
దందా...
Comments
Please login to add a commentAdd a comment