కృష్ణా జేసీకి బీసీ సంక్షేమ సంఘ నాయకుల వినతి
చిలకలపూడి(మచిలీపట్నం): ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో నడవలేని, లేవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు రిజి స్ట్రార్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షే మ సంఘం జిల్లా అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు సోమ వారం జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మకు వినతిపత్రం అందజేశారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలతో లేవలేని పరిస్థితిలో ఉన్న వారు, దివ్యాంగులకు ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటువంటి వారికి రిజిస్ట్రేషన్ సమయంలో ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘ నాయకులు జన్ను గోవింద్, పడమట కోటేశ్వరరావు, చోడవరపు సుబ్రహ్మణ్యం, ఎం. పవన్, బోయిన మురళీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment