విద్యాసాగర్‌కు రవాణాశాఖ ఉద్యోగుల మద్దతు
విజయవాడస్పోర్ట్స్: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో నిరంతరం పోరాటాలు చేస్తున్న ఏపీ ఎన్జీవో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ఏపీ ఎన్టీవో కార్యదర్శి పదవికి అర్హుడని ఏపీ రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోన్–2 అధ్యక్షులు ఎం.రాజుబాబు అన్నారు. రవాణా శాఖ ఉద్యోగుల నుంచి విద్యాసాగర్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎంజీ రోడ్డులోని ఉప రవాణా కమిషనర్(డీటీసీ) కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా రవాణాశాఖ ఉద్యోగులతో రాజుబాబు మంగళవారం సమావేశమై మాట్లాడారు. విద్యాసాగర్ ఉద్యోగుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి పదవి ఈ నెలాఖరు నాటికి ఖాళీ అవుతుందని, ఆ పదవికి విద్యాసాగర్ మాత్రమే వన్నె తెస్తారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పరిస్థితులపై విద్యాసాగర్‌కు పూర్తి అవగాహన ఉందని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థికపరమైన బకాయిలను ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి ఇప్పించగల సత్తా ఆయనకు ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి జరిగే ఎన్నికలో విద్యాసాగర్ విజయం సాధించాలని రవాణాశాఖ జోన్2 ఉద్యోగుల తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తున్నామని ప్రకటించారు. సమావేశంలో జోనల్ సంఘం ఉపాధ్యక్షురాలు జి.ఉషాసుందరి, జోనల్ కమిటీ నాయకులు సత్యన్నారాయణ, రామచంద్రరాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment