28న మెగా వికసిత్ భారత్ జాబ్‌మేళా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో ఈనెల 28వతేదీ ఉదయం 9గంటల నుంచి వికసిత్ భారత్ మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి జాబ్‌మేళా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్, ఎంపీ మాట్లాడుతూ 50పైగా సంస్థల్లో మూడువేలకు పైగా ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్ , పీజీ పూర్తి చేసిన రికి జాబ్‌మేళా ద్వారా వివిధ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు మాట్లాడుతూ పూర్తి వివరాలకు 77993 76111, 93815 30964 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, ఎల్‌డీ
వచ్చేనెలలో పీఎంఈజీపీపై అవగాహన కార్యక్రమాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం(పీఎంఈజీపీ)పై జనవరి నుంచి నియోజకవర్గాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా.జి.లక్ష్మీశ.. పీఎంఈజీపీపై పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, డీఆర్‌డీఏ తదితరశాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకమైన పీఎంఈజీపీపై పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూజిల్లాలో దాదాపు 40వేల ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయని..వీటి అభివృద్ధిపై దృష్టిసారిస్తూనే మరోవైపు యువతను పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కార్యక్రమం ద్వారా బిజినెస్ ఆలోచన మొదలు, ప్రాజెక్టు రూపకల్పన, దరఖాస్తు విధానం, రాయితీ, రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు, యూనిట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక ఇలా ప్రతి అంశంపైనా అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. పీఎంఈజీపీ ద్వారా దాదాపు 1,056 రకాలకు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశముందని వివరించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఎల్‌డీఎం కె.ప్రియాంక, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment