రైలు ఎక్కుతూ కిందపడి ప్రయాణికుడు మృతి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కుతూ జారి కింద పడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. విజయవాడ రైల్టేస్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ నుంచి గుడూరు వెళ్తున్న రైలు ఎక్కుతూ ఒక వ్యక్తి జారి కింద పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎత్తు 5.6 అడుగులుగా, కుడి మోచితిపై వి.అంజలి అనే పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నీలపు రంగు చొక్కా, సిమెంట్ రంగు జీన్స్ ప్యాంట్‌ను ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు విజయవాడ రైల్వేపోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని లేదా 88971 56153 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment