కిడ్నీ వ్యాధులపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని ఎ.కొండూరు మండలంలోని పలు తండాల్లో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య చికిత్సలు, వ్యాధి ప్రభావితం చేసే అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రిలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వేంకటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ బీసీకే నాయక్‌లతో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధుల నివారణకు చర్యలు
కిడ్నీ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, భౌగోళిక పరిస్థితులు, అక్కడి ప్రజల జీవన పరిస్థితులపై సమీక్షించారు. సమీక్షలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుమన్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల ప్రొఫెసర్లు, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, ఔషధ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment