పార్టీలో చేరినవారితో రబినారాయణ నందో
జయపురం: బొరిగుమ్మ సమితిలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సమితిలోని హర్ధిలి గ్రామ పంచాయతీకి చెందిన దాదాపు 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి రబినారాయణ నందో సమక్షంలో బీజేడీలో మంగళవారం చేరారు. వీరందరినీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై బీజేడీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment