గుండె వ్యాధులపై అవగాహన ర్యాలీ
శ్రీకాకుళం అర్బన్: ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కిమ్స్ ఆస్పత్రి నుంచి డే అండ్ నైట్ కూడలి వరకూ గుండె వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రి గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ కిల్లి సతీష్, డాక్టర్ కల్యాణ చక్రవర్తిలు మాట్లాడుతూ గుండె వ్యాధులు రాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ మంచి జీవనశైలి, చక్కటి ఆహార అలవాట్లు, వ్యాయామం, యోగా చేయడం ద్వారా గుండె జబ్బులకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు మానుకోవాలని సూచించారు. కిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డా.గూడేన సోమేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మొట్టమొదట గుండె జబ్బులకు వైద్యసేవలు అందించిన ఆస్పత్రి కిమ్స్ అని, అన్ని రకాల గుండె వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ర్యాలీలో కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీఆర్ సోమేశ్వరరావు, ఆపరేషన్స్ వేదవతి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment