ప్రాచీన చెరువు పునరుద్ధరణకు శంకుస్థాపన
జయపురం: జయపురం సమితి ఉమ్మిరి గ్రామంలో అతి పురాతన చెరువు పునరుద్ధరణకు జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి శుక్రవారం శంకుస్థాపన చేశారు. జయపురం సమితి అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాహిణీపతి మాట్లాడుతూ ఈ చెరువు నిర్లక్ష్యానికి గురవుతున్నందున స్థానికులు పునరుద్ధరించాలని కోరుతున్నారని, ఎట్టకేలకు వారి కోరిక నెరవేరుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో చెరువును పర్యాటక స్థలంగా మారుస్తామని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, సమితి ఉపాధ్యక్షుడు గణేష్ పాఢీ, ఉమ్మిరి సర్పంచ్ సబిత నాయిక్, జయపుర బీడీఓ శక్తి మహాపాత్రో, ప్రభుత్వ కార్యనిర్వాహక ఇంజనీర్ విశ్వనాథ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment