కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం
రాయగడ: స్థానిక జగన్నాథ మందిరం సమీపంలోని ఓ కిరాణా దుకాణలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం యజమాని సంతోష్‌కుమార్ బెహర ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్‌ను విక్రయించేందుకు వాటిని బయట పెట్టాడు. దీపావళి పండుగ సందర్భంగా అక్కడి వారు బాణసంచా కాలుస్తున్న సమయంలో నిప్పురవ్వ ఎగిరిపడి దుకాణంపై పడడంతో మంటలు వ్యాపించాయి. పెట్రోల్‌తో ఉన్న బాటిళ్లు కింద పడడంతో ప్రమాద తీవ్రతమరింత పెరిగింది. స్థానికులు సుమారు గంట శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే దుకాణంలోని సామాన్లు, ప్రిజ్ వంటివి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికి మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రమాదానికి కారణాలు తెలుసుకుని వెనుతిరిగారు. ఇదిలాఉండగా పట్టణంలోని పలు దుకాణాల్లో పెట్రోల్‌ను విడిగా బాటిళ్లలో పోసి విక్రయిస్తున్నారు. ఇటువంటి తరహా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో అగ్నికి ఆజ్యం పొసినట్లవుతుంది. కిరాణా దుకాణాల్లో పెట్రోల్ విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కొరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment