వేదన
రాయగడ: గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఒక రోగిని మంచంపై 5 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లిన ఘటన జిల్లాలోని కాసీపూర్ సమితి కొడిపారి పంచాయతీ భెజాపొదొరొ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని జమ్ము మాఝి భార్య మోర్చి మాఝి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గ్రామస్తులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో 5 కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తప్పనిసరి పరిస్థితిలో మంచంపై రోగిని ఉంచి మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను కాసీపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. రహదారి సౌకర్యాలు లేకపోవడంతో ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటుండడం పరిపాటిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment