పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
జయపురం: పౌష్టికాహార సంబంధిత తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న 500 మంది రైతులకు జయపురం ఫూల్‌బెడలోని ఎస్.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ కేంద్రంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఒడిశా ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో పౌష్టికాహార సంబంధిత వ్యవసాయ ప్రణాళిక, యాజమాన్యంపై శిక్షణ ఇచ్చినట్లు ఎం.ఎస్.మినాథన్ రిసెర్చ్ జయపురం కేంద్ర డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ తెలిపారు. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి, నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితిలోని 500 మంది రైతులు హాజరయ్యారు. పౌష్టికాహార తోటలలో మూడు రకాల కాయగూరల పంటలు, ఆకు కూరలు, దుంప జాతులు, మొదలగు పంటలు ఎలా పండించాలి, పంటల యాజమాన్యం, కాయగూరల తోటల గట్లపై వివిధ రకాల పండ్ల చెట్లు నాటి పండించటంపై వివరించారు. నర్సరీల ద్వారా ఎలా ఉత్తమ నారు పెంచాలో శిక్షణ ఇచ్చారు. ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. శిక్షణ పొందిన రైతులు తమ గ్రామాలోని రైతులకు శిక్షణ ఇవ్వాలని ప్రశాంత కుమార్ పొరిడ అన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ కేంద్రం ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ అక్షయ్‌కుమార్ పండ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment