పర్లాకిమిడి: గజపతి జిల్లా ఉద్యానవన శాఖలో 1988లో విజిలెన్సు శాఖకు పట్టుబడిన ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఏడాది జైలు శిక్ష, పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ బరంపురం విజిలెన్సు స్పెషల్ జడ్జి బుధవారం తీర్పు నిచ్చారు. గజపతి జిల్లా ఉద్యానవన శాఖలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించకుండా స్వాహా చేసిన కేసులో విజిలెన్సు అధికారులకు పట్టుబడ్డారు. జగన్నాథ సామంత (విశ్రాంత ఉద్యానవన శాఖ అధికారి), మాజీ ఫీల్డు టెక్నీషియను రంకానిధి డకువా (పర్లాకిమిడి), ఉద్యానవనశాఖ మాజీ ఫీల్డు టెక్నీషియన్ శబర ప్రధాన్, ప్రతాప్ చంద్ర పట్నాయక్ (మాజీ గ్రాఫ్టర్), పర్లాకిమిడి, సనాతన గోమాంగో గ్రాఫ్టర్ (కాశీనగర్), మాజీ గ్రాఫ్టర్ పురుషోత్తమ బెహారా (గుమ్మా బ్లాక్), వనమాలి హారిహార నాయక్ (నువాగడ బ్లాక్)లపై చార్జిషీటు 1988 409/467/468/477/ 341 సి.ఆర్.పి.సి కింద నిందితులుగా విజిలెన్సు జడ్జి, బరంపురం నిర్ధారిస్తూ తీర్పు చెప్పారు. పై ఏడుగురు ఉద్యోగుల నెలవారీ పింఛన్లను కూడా నిలిపి వే యాలని విజిలెన్సు అధికారులు (బరంపురం) సంబంధిత శాఖలకు ఆర్జీలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment